ప: అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు
ఏడేండ్ల శ్రమల రోజు పాపులంతా ఏడ్చే రోజు “ఆ రోజు” ||అదే అదే||
చ: వడగండ్లు కురిసే రోజు భూమి సగం కాలే రోజు (2)
నక్షత్రములు రాలే రోజు నీరు చేదు అయ్యే రోజు
ఆ నీరు సేవించిన మనుషులంతా చచ్చే రోజు “ఆ రోజు”
ఆ నీరు సేవించిన మనుషులంతా చచ్చే రోజు “ఆ రోజు”
||అదే అదే||
చ: సూర్యుడు నలుపయ్యే రోజు చంద్రుడు ఎరుపయ్యే రోజు (2)
భూకంపం కలిగే రోజు దిక్కు లేక అరచే రోజు
ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు “ఆ రోజు” ||అదే అదే||
ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు “ఆ రోజు” ||అదే అదే||
చ: మిడతల దండొచ్చే రోజు నీరు రక్తమయ్యే రోజు (2)
కోపాగ్ని రగిలే రోజు పర్వతములు పగిలే రోజు
“ఆ రోజు” ||అదే అదే||
చ: వ్యభిచారులు ఏడ్చే రోజు మోసగాళ్ళు మసలే రోజు (2)
అబద్ధికులు అరచే రోజు దొంగలంతా దొరికే రోజు
“ఆ రోజు” ||అదే అదే||
అబద్ధికులు అరచే రోజు దొంగలంతా దొరికే రోజు
“ఆ రోజు” ||అదే అదే||
చ: పిల్ల జాడ తల్లికి లేక తల్లి జాడ పిల్లకు లేక (2)
చేట్టుకొక్కరై పుట్టకొక్కరై అనాథలై అరచే రోజు
“ఆ రోజు” ||అదే అదే||
చేట్టుకొక్కరై పుట్టకొక్కరై అనాథలై అరచే రోజు
“ఆ రోజు” ||అదే అదే||
చ: ఓ మనిషి యోచింపవా నీ బ్రతుకు ఎలా ఉన్నదో (2)
బలము చూసి భంగ పడకుమా ధనము చూసి దగా పడకుమా
“ఆ రోజు” ||అదే అదే||
బలము చూసి భంగ పడకుమా ధనము చూసి దగా పడకుమా
“ఆ రోజు” ||అదే అదే||
No comments:
Post a Comment