ప: నిను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా
నిను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా (2)
నిను చేరే పాదములు నాకు ఇవ్వయ్యా (2)
నీ మాట వినే చెవులు ఇమ్ము యేసయ్యా ||నిను చూసే||
నిను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా (2)
నిను చేరే పాదములు నాకు ఇవ్వయ్యా (2)
నీ మాట వినే చెవులు ఇమ్ము యేసయ్యా ||నిను చూసే||
చ: కన్నీటి ప్రార్థన నాకు నేర్పయ్యా
ఆత్మల సంపద నాకు ఇవ్వయ్యా (2)
నీ కొరకే జీవించే సాక్షిగా మార్చయ్యా
నాలోనే నిను చూపే మదిరినివ్వయ్యా ||నిను చూసే||
ఆత్మల సంపద నాకు ఇవ్వయ్యా (2)
నీ కొరకే జీవించే సాక్షిగా మార్చయ్యా
నాలోనే నిను చూపే మదిరినివ్వయ్యా ||నిను చూసే||
చ: అందరితో సఖ్యత ఇమ్ము యేసయ్యా
మృదువైన మాటతీరు నాకు ఇవ్వయ్యా (2)
కోపతాపములు దూరపరచయ్యా
అందరిని క్షమియించే మనస్సునివ్వయ్యా ||నిను చూసే||
మృదువైన మాటతీరు నాకు ఇవ్వయ్యా (2)
కోపతాపములు దూరపరచయ్యా
అందరిని క్షమియించే మనస్సునివ్వయ్యా ||నిను చూసే||
No comments:
Post a Comment