Pages

ఆలయంలో ప్రవేశించండి అందరు స్వాగతం సుస్వాగతం యేసు నామంలో

: ఆలయంలో ప్రవేశించండి అందరు స్వాగతం సుస్వాగతం యేసు నామంలో
మీ బ్రతుకులో పాపమా కలతలా మీ హృదయంలో బాధలా కన్నీరా
మీ కన్నీరంతా తుడిచి వేయు రాజు యేసు కోసం               ||ఆల||     
    
    చ: దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై వెదికే వారికంతా కనబడు దీపము
యేసు రాజు మాటలే వినుట ధన్యము వినుట వలన విశ్వాసం అధికమధికమై ఆత్మలో దాహము తీరెను రారండి 
ఆనందమానందం హల్లెలూయా                           ||ఆలయంలో||

: ప్రభు యేసు మాటలే పెదవిలో మాటలై జీవ వృక్షంబుగా ఫలియించాలని
           పెదవితో పలికెదం మంచి మాటలే హృదయమంతా 
           యేసు ప్రభుని ప్రేమ మాటలై నింపెదం నిండెదం కోరెదం పొందెదం    

           ఆనందమానందం హల్లెలూయా                                 ||ఆలయంలో||

No comments:

Post a Comment