ప: నిత్యము స్తుతించినా నీ
ఋణము తీర్చలేను
సమస్తము నీకిచ్చినా నీ త్యాగము మరువలేను (2)
సమస్తము నీకిచ్చినా నీ త్యాగము మరువలేను (2)
రాజా రాజా రాజాధి రాజువు నీవు
దేవా దేవా దేవాది దేవుడవు (2) ||నిత్యము||
దేవా దేవా దేవాది దేవుడవు (2) ||నిత్యము||
చ: అద్వితీయ దేవుడా ఆది అంతములై యున్నవాడా (2)
అంగలార్పును నాట్యముగామార్చివేసిన మా ప్రభు (2) ||రాజా||
అంగలార్పును నాట్యముగామార్చివేసిన మా ప్రభు (2) ||రాజా||
చ:
జీవమైన దేవడా జీవమిచ్చిన నాథుడా (2)
జీవజలముల బుగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి (2) ||రాజా||
జీవజలముల బుగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి (2) ||రాజా||
చ: మార్పులేని
దేవుడా మాకు
సరిపోయినవాడా (2)
మాటతోనే సృష్టినంతా కలుగజేసిన పూజ్యుడా
మాటతోనే సృష్టినంతా కలుగజేసిన పూజ్యుడా
(2) ||రాజా||
No comments:
Post a Comment