Pages

ఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడుండగా


: బాధ లేదు కష్టం లేదు యేసు తోడుండగా
    చింత లేదు నష్టం లేదు ప్రభువే మనకుండగా
    దిగులేల సోదరా ప్రభువే మనకండగా
    భయమేల సోదరీ యేసే మనకుండగా
    హల్లెలూయ హల్లెలూయహల్లెలూయ                       (2) || బాధ||

: ఎర్ర సంద్రం ఎదురొచ్చినా యెరికో గోడలు అడ్డొచ్చినా
   సాతాను శోధించినా శత్రువులే శాసించినా
    పడకు భయపడకు బలవంతుడే నీకుండగా
    నీకు మరి నాకు ఇమ్మానుయేలుండగా                             ||దిగులేల||

: పర్వతాలు తొలగినా మెట్టలు తత్తరిల్లినా
    తుఫానులు చెలరేగినా వరదలు ఉప్పొంగినా
    కడకు నీ కడకు ప్రభు యేసే దిగి వచ్ఛుగా
    నమ్ము ఇది నమ్ము యెహోవా యీరే కదా                        ||దిగులేల||

No comments:

Post a Comment