Pages

పరిశుద్ధుడు పరిశుద్ధుడు – రాజుల రాజు యేసు

ప: పరిశుద్ధుడు పరిశుద్ధుడు – రాజుల రాజు యేసు
    బలవంతుడు బలమిచ్చును – ప్రభువుల ప్రభువు క్రీస్తు             (2)

చ: గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిననూ
అగాధ జల ప్రవాహములో నేను సాగవలసిననూ                     (2)
ఎన్నటికీ భయపడను నీవు తోడుండగా
ఎన్నటికీ వెనుతిరుగను నాయందు నీవుండగా         ||పరిశుద్ధుడు||  
                                                                             
చ: నశించు ఆత్మల రక్షణకై నే ప్రయాసపడుదును
కష్టములెన్నొచ్చినా కృంగిపోకుందును                                 (2)
ఎన్నటికీ వెనుతిరుగను అండ నీవుండగా
ఎన్నటికీ ఓడిపోను – జయశాలి నీవుండగా            

                                                                            ||పరిశుద్ధుడు||

No comments:

Post a Comment