Pages

వీచే గాలుల్లో ప్రతి రూపం నీవే నీవే నా మంచి యేసయ్యా

: వీచే గాలుల్లో ప్రతి రూపం నీవే నీవే నా మంచి యేసయ్యా
    ప్రవహించే సెలయేరై రావా నీవు జీవ నదిలా మము తాకు యేసయ్యా
    నీవే నా ప్రాణమునీవే నా సర్వము

నీతోనే కలిసుండాలి – నీలోనే నివసించాలి
నీలోనే తరియించాలి ప్రభు                                               (2)
నా ప్రియ యేసు నా ప్రాణ నేస్తం
నీవు లేకుంటే నేను జీవించలేను                                    (2)  ||వీచే||

: ప్రేమించే నా ప్రాణం నీవే నా నేస్తం కడవరకు కాపాడే నీవే నా దైవం
పోషించే నా తండ్రి నీవే ఆధారం కరుణగల నీ మనసే నాకు చాలును
నీ మాటలే మాకు ఉజ్జీవం నీ వాక్యమే జీవ చైతన్యం    (2)   ||నా ప్రియ||

: ప్రతి సమయం నే పాడే నీ ప్రేమ గీతం

ప్రతి హృదయం పాడాలి స్తుతి నైవేద్యమై
నే వెళ్ళే ప్రతి చోట చాటాలి నీ ప్రేమే
నీ సిలువ సాక్షినై నీ ప్రేమను చూపాలి మా కోసమే నీవు మరణించి
పరలోకమే మాకు ఇచ్చావు                                     (2)   ||నా ప్రియ||

No comments:

Post a Comment