ప: ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో (2)
ఆనంద గానముతో ఆర్భాట నాదముతో (2) ||ఆరా||
ఆనంద గానముతో ఆర్భాట నాదముతో (2) ||ఆరా||
చ: నీ జీవ వాక్యము నాలో జీవము కలిగించె (2)
జీవిత కాలమంతా నా యేసయ్యా నీకై బ్రతికెదను (2) ||ఆరా||
జీవిత కాలమంతా నా యేసయ్యా నీకై బ్రతికెదను (2) ||ఆరా||
చ: చింతలన్ని కలిగిననూ నిందలన్ని నన్ను చుట్టినా (2)
సంతోషముగ నేను నా యేసయ్యా నిన్నే వెంబడింతును (2) ||ఆరా||
సంతోషముగ నేను నా యేసయ్యా నిన్నే వెంబడింతును (2) ||ఆరా||
No comments:
Post a Comment