ప: నిబ్బరం కలిగి ధైర్యముగుండు
దిగులు పడకు జడియకు ఎప్పుడు (2)
నిన్ను విడువడు నిన్ను మరువడు ప్రభువే నీ తోడు
హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా
ఊరక నిలిచి ప్రభువు చూపే – రక్షణ చూద్దాము
నీ శత్రువులు ఇకపై ఎప్పుడూ – కనబడరన్నాడు
హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా ||నిబ్బరం||
నిన్ను విడువడు నిన్ను మరువడు ప్రభువే నీ తోడు
హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా
ఊరక నిలిచి ప్రభువు చూపే – రక్షణ చూద్దాము
నీ శత్రువులు ఇకపై ఎప్పుడూ – కనబడరన్నాడు
హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా ||నిబ్బరం||
చ: పర్వతాలు తొలగినా – మెట్టలు తత్తరిల్లినా (2)
ప్రభు కృప మమ్మును విడువడుగా (2)
ఎక్కలేని ఎత్తైన కొండను ఎక్కించును మా ప్రభు కృప మమ్మును-
ప్రభువే మా బలము … ||హల్లె||
ఎక్కలేని ఎత్తైన కొండను ఎక్కించును మా ప్రభు కృప మమ్మును-
ప్రభువే మా బలము … ||హల్లె||
చ: మునుపటి కంటెను – అధికపు మేలును మా ప్రభు మాకు- కలిగించును (2)
రెట్టింపు ఘనతతో మా తలను ఎత్తును
శత్రువు ఎదుటనే భోజనమిచ్చునుప్రభువే మా ధ్వజము ||హల్లె||
రెట్టింపు ఘనతతో మా తలను ఎత్తును
శత్రువు ఎదుటనే భోజనమిచ్చునుప్రభువే మా ధ్వజము ||హల్లె||
చ: మా అంగలార్పును – నాట్యముగా మార్చెను-
బూడిద బదులు సంతోషమిచ్చెను (2)
బూడిద బదులు సంతోషమిచ్చెను (2)
దుఃఖ దినములు సమాప్తమాయెను
ఉల్లాస వస్త్రము ధరియింప చేసెను ప్రభునకే స్తోత్రం ||హల్లె||
ఉల్లాస వస్త్రము ధరియింప చేసెను ప్రభునకే స్తోత్రం ||హల్లె||
చ: స్త్రీ తన బిడ్డను – మరచినా మరచును (2)
మా ప్రభు మమ్మును మరువడుగా (2)
చూడుము నా అరచేతిలనే చెక్కితి నిను అన్నాడు ప్రభువు
ప్రభువే చూచుకొనును ||హల్లె||
చూడుము నా అరచేతిలనే చెక్కితి నిను అన్నాడు ప్రభువు
ప్రభువే చూచుకొనును ||హల్లె||
చ: రాబోవు కాలమున – సమాధాన సంగతులే (2)
మా ప్రభు మాకై ఉద్దేశించెను (2)
ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నానని మా ప్రభువు చెప్పెను
ఇప్పుడే అది మొలుచున్ ||హల్లె||
ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నానని మా ప్రభువు చెప్పెను
ఇప్పుడే అది మొలుచున్ ||హల్లె||
చ: మేము కట్టని ఫురములను – మేం నాతని తోటలను (2)
మా ప్రభు మాకు అందించును (2)
ప్రాకారముగల పట్టణములోనికి ప్రభువే మమ్మును నడిపింపచేయును
ప్రాకారముగల పట్టణములోనికి ప్రభువే మమ్మును నడిపింపచేయును
ప్రభువే మా పురము ||హల్లె||
No comments:
Post a Comment