Pages

కన్నీరేలమ్మా… కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా


: కన్నీరేలమ్మా… కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా
    కలవరపడకమ్మా… కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా
    కరుణ చూపి కలత మాన్పె           (2) యేసే తోడమ్మా ||కన్నీరేలమ్మా||

: నీకేమీ లేదని ఏమీ తేలేదని అన్నారా నిన్ను అవమాన పరిచారా
తల రాత ఇంతేనని తర్వాత ఏమౌనోనని
రేపటిని గూర్చి చింతించుచున్నావా
చింతించకన్న యేసు మాటలు మరిచావా
మారాను మధురంగా మార్చెను చూసావా           (2) ||కన్నీరేలమ్మా||

: నీకెవరూ లేరని ఏం చేయలేవని అన్నారా నిన్ను నిరాశపరచారా
పొరుగంటివాడనని ఎప్పటికీ ఇంతేనని
నా బ్రతుకు మారదని అనుకుంటూ ఉన్నావా
నేనున్నానన్న యేసు మాటలు మరిచావా
కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా               (2) ||కన్నీరేలమ్మా||

No comments:

Post a Comment