Pages

ఈ తరం యువతరం


: తరం యువతరం ప్రభు యేసుకే అంకితం
     నా బలం యవ్వనం ప్రభు యేసుకే సొంతము

    రా సోదరీ రారా సోదరా ప్రభు యేసు వార్త చాటుదాం
    రా సోదరీ రారా సోదరా ప్రభు యేసు రాజ్యము స్థాపిద్దాం       || తరం||
: సువార్త సేవ నానాటికి చల్లారిపోయెగా ఆత్మల సంపద
     మరి ఎందుకో అడుగంటిపోయెగా
     దేవుని సేవ వ్యాపారమాయే ఆత్మల రక్షణ నిర్లక్ష్యమాయే
     నీవు కాకపోతే ఇంకెవ్వరు నేడు కాకపోతే ఇంకెన్నడు        ||రా సోదరీ||
: నశించిపోయే ఆత్మలు ఎన్నో అల్లాడుచుండెనుగా
     యేసయ్య ప్రేమ చాటించే సైన్యం బహు తక్కువాయెగా
     యేసయ్య రాకడ సామీపమాయే వార్త చాటను వేగిర రావే
     నీవు కాకపోతే ఇంకెవ్వరు నేడు కాకపోతే ఇంకెన్నడు        ||రా సోదరీ||

No comments:

Post a Comment