Pages

ఏం చేసానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని


: ఏం చేసానయ్యా నీకోసం బ్రతుకునిచ్చావని                            (2)
    ఏం మోసానయ్యా నీకోసం నీవు నన్ను చూచావని                       (2)
    ఒక్కరినైనా ఒక ఆత్మనైనా  రక్షించానా నీకై వెలిగించానా 
                                                                                  (2)  ||ఏం చేసా||
: ప్రాణమిచ్చావయ్యా బుద్ధినిచ్చావయ్యా
మాటలిచ్చావయ్యా నాకు బ్రతుకు నేర్పావయ్యా                          (2)
ఎన్ని ఇచ్చినా నిన్నే నేను ఘనపరచానా నిన్నే ఎదిరించానా       (2)
ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా                                  (2)
నాకున్నవన్ని నీ పనిలో వాడనిస్తానయ్యా                   (2) ||ఏం చేసా||

: ధనమునిచ్చావయ్యా ఘనతనిచ్చావయ్యా
శ్రద్ధ నిలిపావయ్యా పోషింప జేసావయ్యా                                       (2)
ఎన్ని ఇచ్చినా నీకై నేను ఖర్చయ్యానా
నా కడుపు నింపుకున్నానా                                          (2) ||ఇప్ప ||

: ఇల్లునిచ్చావయ్యా వాహనమునిచ్చావయ్యా
భాగ్యమిచ్చావయ్యా నాకు సుఖమునిచ్చావయ్యా                   (2)
ఎన్ని ఇచ్చినా నీకై నేను కష్టించానా సోమరినైపోయానా     (2) ||ఇప్ప||

No comments:

Post a Comment