Pages

కన్నీళ్లతో పగిలిన గుండెతో అలసిన నేస్తమా


: కన్నీళ్లతో పగిలిన గుండెతో అలసిన నేస్తమా
    మనసున్న మారాజేసుని మదిలో నిలుపుమా                         (2)
    విడువడు నిన్ను ఎడబాయడు నిన్ను
    కష్టాల కడలిలో గమ్యానికి చేర్చును                                       (2)


: రాతిరంత ఏడుపొచ్చినా – కంట నీరు ఆగకుండినా
     కాలమింక మారకుండునా – వెలుగు నీకు కలగకుండునా
ప్రాణమిచ్చి ప్రేమ పంచినా – పేరు పెట్టి నిన్ను పిలచినా
నీ చేయి పట్టి విడచునా – అనాథగా నిన్ను చేయునా             
                                                                                     ||విడు||

: అంధకారమడ్డు వచ్చినా – సంద్రమెంత ఎత్తు లేచినా
నిరాశలే పలకరించినా – క్రీస్తు ప్రేమ నిన్ను మరచునా
బాధ కలుగు దేశమందునా – బంధకాలు ఊడకుండునా
శత్రువెంతో పగతో రగిలినా – గిన్నె నిండి పొర్లకుండునా        ||విడు||

No comments:

Post a Comment