Pages

ఏందిరో పెద్ధన్నో ప్రార్ధనకొచ్చిన

: ఏందిరో పెద్ధన్నో ప్రార్ధనకొచ్చిన పాటలు పాడిన - మాటలు మారవుగా 
    ఏందిరో చిన్నన్నో సంగం లోపల సాక్ష్యం లిచ్చిన - సాకులు మారవుగా 
    ఆదివారం నాడు గుళ్ళోకి వస్తావు
    శుక్రవారం నాడు - ఉపవాసాలు ఉంటావు 
    ఏది చేసిన ఎంత చేసిన నీ జీవితమే మారలేదు                     " ఏందిరో"

  : ప్రార్ధనికి రమ్మంటే పనిలోకి పోతావు
     పనికిరాని సంగతులన్నీ  పనిపట్టుకు వింటావు 
     విందులకు వినోదాలకు సమయమంతా ఇస్తావు                       (2)
     క్రైస్తవుడని పేరు మాత్రం చాలదు నీకు ఓరన్నో
     క్రీస్తుని కలిగి బ్రతుకన్నా                                                    " ఏందిరో"

: వాక్యమెంతో వింటావు వీక్నెస్సై పోతావు 
    ఉపవాసలున్నానంటు ఊసులెన్నో చెబుతావు                          (2)
    పైకి పచ్చ ధనమే ఉన్న ఫలములేని బ్రతుకే సున్నా                  (2)
    నామకార్ధ క్రైస్తవ బ్రతుకు వీడు నేడే ఓరన్నా 
     విస్వసిగా క్రీస్తును చాటన్నా                                          
" ఏందిరో"

: ప్రార్ధనలో ఫలితం ఉందని పది మందికి చేబుతావు 
     తీర అది నీదాకొస్తే ప్రక్క దారి పడతావు                          (2)
     పది చర్చులు తిరుగుతావు పనికి రాక పోతావు               (2)
     పరలోక రాజ్యం చేరే దారి వేరే లేదన్నా ప్రభువే నీకు దారన్నా

                                                                                         " ఏందిరో"

No comments:

Post a Comment